Header Banner

ఉగ్రదాడిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం! మోదీ అధ్యక్షతన CCS అత్యవసర సమావేశం

  Wed Apr 23, 2025 20:53        Politics

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో, దేశ రాజధాని న్యూఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశమైంది. లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ భేటీకి అధ్యక్షత వహిస్తున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జయశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమన్ ప్రీత్ సింగ్‌లు కూడా హాజరై తాజా భద్రతా పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు తీపి కబురు! రూ.2 లక్షల నుండి రూ.4 లక్షల వరకు ప్రయోజనం! మీ పేరు నమోదు చేసుకోండి!

 

పహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్మూకశ్మీర్‌లోని భద్రతా పరిస్థితులు, తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, పహల్గాం దాడికి సంబంధించి భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, భద్రతాపరమైన అంశాలపై కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఈ సీసీఎస్ సమావేశానికి ముందే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పహల్గాం దాడికి పాల్పడిన వారిని ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేసిన విషయం గమనార్హం. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. ప్రస్తుతం జరుగుతున్న ఉన్నత స్థాయి సమావేశం అనంతరం కీలక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!

 

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Modi #NarendraModiSpeech #BJP #UnionBudget